ఏపీలో అంబులెన్సుల కుంభకోణం: పట్టాభి

104, 108 అంబులెన్స్‌ల వ్యవహారంలో భారీ అవినీతి చోటు చేసుకుందని తెదేపా నేత పట్టాభి ఆరోపించారు. తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా

Updated : 01 Jul 2020 12:06 IST

అమరావతి: 104, 108 అంబులెన్స్‌ల వ్యవహారంలో భారీ అవినీతి చోటు చేసుకుందని తెదేపా నేత పట్టాభి ఆరోపించారు. తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అరబిందో సంస్థకు ఎలాంటి భారం లేకుండా ప్రభుత్వమే అన్నీ సమకూర్చిందని మండిపడ్డారు. 104, 108 అంబులెన్స్‌ల వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. 

దాదాపు 46 పరికరాలు ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇస్తోందన్నారు. అన్ని పరికరాలు కొనుగోలు చేసి అరబిందో ఫౌండేషన్‌కు ఇచ్చి, ఒక్కో అంబులెన్స్‌ నిర్వహణకు రూ.1.60 లక్షలు ఎందుకిస్తున్నారని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి వియ్యంకుడికి చెందిన సంస్థకు రూ.300 కోట్లు దోచిపెడుతున్నారని ఆరోపించారు. కేవలం 4, 5 రకాల టెస్టుల కోసం అరబిందోకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం రూ.201 కోట్లతో 1068 కొత్త అంబులెన్స్‌లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని