‘‘వాళ్ల ప్రాజెక్టులు ఏకంగా కొట్టుకుపోయాయి’’

కొండపోచమ్మ సాగర్‌ కాల్వ లీకేజీపై కాంగ్రెస్‌, భాజపా గ్లోబెల్‌ ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు.

Updated : 12 Oct 2022 16:02 IST

ప్రతిపక్షాల విమర్శలపై మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్య

సిద్దిపేట: కొండపోచమ్మ సాగర్‌ కాల్వ లీకేజీపై కాంగ్రెస్‌, భాజపా గ్లోబెల్‌ ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. చిన్న కాల్వ తెగితే పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రాజెక్టులు ఏకంగా కొట్టుకుపోయిన విషయం మరిచిపోవద్దని సూచించారు. 2007లో ఖమ్మం జిల్లా పాలెం వాగు ప్రాజెక్టు కొట్టుకుపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు సిద్ధం కాకముందే కొట్టుకుపోయిందన్నారు. ఎల్లంపల్లి నిర్మాణంలో లోపం ఉందని కాంగ్రెస్‌ వదిలేసిందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. దేవాదుల ప్రాజెక్టు పైపులు పటాకులు లాగా పేలిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే అని మంత్రి అన్నారు. గుజరాత్‌లోని సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టు కాల్వలకు 200 సార్లు గండిపడిన విషయాన్ని హరీశ్ రావు గుర్తు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని