2030 వరకు మోదీయే ప్రధాని: రామ్‌మాధవ్‌

కరోనాను అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ అన్నారు.

Published : 02 Jul 2020 01:23 IST

హైదరాబాద్‌: కరోనాను అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ అన్నారు. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాలతో భాజపా జన సంవాద్‌ వర్చువల్‌ సభలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వ పాలన, కరోనా నివారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి గురించి ఆయన విమర్శించారు. ‘‘తెలంగాణలో అవినీతి, అసమర్థ పాలన కొనసాగుతోంది. కరోనా బారిన పడుతున్న ప్రజలను ఇంకెంతకాలం మోసం చేస్తారు. సగం పూర్తయిన కాళేశ్వరం ప్రాజెక్టు తప్పా చూపించడానికి కేసీఆర్‌కు మరేమీ లేదు’’ అని రామ్‌మాధవ్‌ ఎద్దేవా చేశారు.

‘‘కరోనా నియంత్రణలో భారత్ సఫలీకృతమైంది. కేంద్రం చూపించిన శ్రద్ద రాష్ట్రాలు చూపిస్తేనే కరోనాను పూర్తిగా అరికట్టగలం. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే దేశ సమగ్రత, మహిళల హక్కులు, రైతుల అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తెచ్చారు. 70 ఏళ్లలో సాధ్యం కాని ఆర్టికల్‌ 370ని 70 గంటల్లో రద్దు చేసిన ఘనత ఆయనది. 2030 వరకు ప్రధానిగా మోదీయే కొనసాగుతారు. మోదీ అధికారంలోకి వచ్చాక ఒప్పందాలు చేసుకోవడం లేదు.. పోరాటం చేస్తున్నాం’’ అని రామ్‌మాధవ్‌ అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని