కోర్టులపై తమ్మినేని వ్యాఖ్యలు..సబ్బం కౌంటర్‌

ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఎవరూ కోర్టులకు వెళ్లరని మాజీ ఎంపీ సబ్బం హరి .....

Published : 03 Jul 2020 21:31 IST

విశాఖ: ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఎవరూ కోర్టులకు వెళ్లరని మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు. సెలెక్ట్‌ కమిటీకి వెళ్లిన బిల్లును మళ్లీ సభలో పెట్టారని ఆయన ప్రశ్నించారు. ప్రజలు, సమాజం పక్షాన కోర్టులు నిలబడుతున్నాయన్నారు. ఏపీ సభాపతి తమ్మినేని సీతారాం కోర్టు తీర్పుల తీరును తప్పుపట్టేలా కాణిపాకంలో నిన్న చేసిన వ్యాఖ్యలపై సబ్బం హరి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..  ‘కోర్టులను అవహేళన చేసి మాట్లాడటం తగదు. ఆంగ్లం వద్దని కోర్టు చెప్పలేదు.. తెలుగు మాధ్యమం ఉండాలనే చెప్పింది. ప్రజలకు మేలు చేసే ఏ కార్యక్రమాన్నీ కోర్టులు అడ్డుకోలేదు. స్పీకర్‌ పదవిలో ఉన్న వ్యక్తులు ముఖ్యంగా కోర్టులపై మాట్లాడకుండా ఉండటం మంచిది. ఇంకోసారి మాట్లాడితే ఎవరో ఒకరు కచ్చితంగా కోర్టులో కేసు వేస్తారు’’ అని అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని