అందుకే మూడు రాజధానులు: కన్నబాబు

అమరావతి రైతులకు సీఎం జగన్‌ అన్ని విధాలుగా  న్యాయం చేస్తున్నారని ఏపీ వ్యవసాయశాఖ .....

Updated : 04 Jul 2020 16:22 IST

మంత్రి కన్నబాబు విమర్శలు

అమరావతి: అమరావతి రైతులకు సీఎం జగన్‌ అన్ని విధాలుగా  న్యాయం చేస్తున్నారని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. చంద్రబాబు 30 గ్రామాలకే ప్రతినిధిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు రాజధాని రైతులకు ఆయన కౌలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. చంద్రబాబు చేయలేని అభివృద్ధిని అమరావతిలో తమ ప్రభుత్వం చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో మూడు వ్యవసాయ యాంత్రీకరణ శిక్షణా కేంద్రాలు శ్రీకాకుళం, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నట్టు కన్నబాబు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని