
రాజధాని అంగుళం కూడా కదలదు: సుజనా
దిల్లీ: అమరావతి నుంచి రాజధాని అంగుళం కూడా కదలదని భాజపా ఎంపీ సుజనా చౌదరి అన్నారు. కేంద్రం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అమరావతి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్విటర్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రాజధాని ప్రాంత రైతులు చేపట్టిన పోరాటం 200 రోజుకు చేరిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.