అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇదా?: కళా

అభివృద్ధి వికేంద్రీకరణ అంటే కార్యాలయాలు మార్చడం కాదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కళా వెంకట్రావు అన్నారు.

Published : 04 Jul 2020 18:24 IST

అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణ అంటే కార్యాలయాలు మార్చడం కాదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కళా వెంకట్రావు అన్నారు. వికేంద్రీకరణ అంటే స్థానిక సంస్థలకు విధులు - నిధులు బదలాయించడమన్నారు. ప్రైవేటు కన్సల్టెంట్లతో స్థానిక సంస్థల నిర్వీర్యం అభివృద్ధి వికేంద్రీకరణా? అని కళా ప్రశ్నించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అమరావతి రాజధాని ప్రాంత రైతులు పోరాటం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. వారి పోరాటం నేటికి 200 రోజులకు చేరుకున్న సందర్భంగా కళా ఈ వ్యాఖ్యలు చేశారు.  

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని