వారి విద్యుత్‌ బిల్లులు మాఫీ చేయండి: ఉత్తమ్‌

లాక్‌డౌన్‌ వేళ బీపీఎల్‌ కుటుంబాలు, ఎంఎస్‌ఎంఈలకు విద్యుత్‌ బిల్లులు మాఫీ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Published : 06 Jul 2020 01:34 IST

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ వేళ బీపీఎల్‌ కుటుంబాలు, ఎంఎస్‌ఎంఈలకు విద్యుత్‌ బిల్లులు మాఫీ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. లక్షలాది మంది విద్యుత్‌ వినియోగదారులు విద్యుత్‌ బిల్లుల్లో లోపాలపై ఫిర్యాదు చేస్తున్నారని పేర్కొన్నారు. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ గానీ, ఇంధన శాఖ గానీ ఎలాంటి దిద్దుబాటు చర్యలూ తీసుకోలేదన్నారు. పెరిగిన, తప్పుడు బిల్లులను సకాలంలో చెల్లించకపోతే విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని అధికారులు బెదిరిస్తున్నారన్నారు. విద్యుత్‌బిల్లులన్నింటినీ టెలిస్కోపిక్‌ విధానంలో సవరిస్తే బిల్లులు భారీగా తగ్గుతాయని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని