సీఎం జగన్‌కు నరసాపురం ఎంపీ మరో  లేఖ 

ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి లేఖ రాశారు.

Published : 06 Jul 2020 01:37 IST

అమరావతి: ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి లేఖ రాశారు. వృద్ధాప్య పింఛను వయో పరిమితి 65 ఏళ్లు నుంచి 60కి తగ్గిస్తూ గతేడాది జీవో ఇచ్చారని గుర్తుచేశారు. జూలై 2019 నుంచి జీవో అమలు చేస్తామని చెప్పి.. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అమలు చేస్తున్నారన్నారు. దీనివల్ల ఒక్కో లబ్ధిదారుడు ఏడు నెలలకు రూ.15,750 నష్టపోయారని పేర్కొన్నారు. అర్హులకు ఆ మొత్తం అందేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఏటా పెంచే పింఛను రూ.250 మొత్తాన్ని వైఎస్‌ జయంతి నుంచి ఇవ్వాలన్నారు. ప్రస్తుత పింఛను మొత్తాన్ని రూ.2500కు పెంచాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని