‘‘తాజా ఆరోపణలకూ సమాధానం లభిస్తుంది’’

అస్తవ్యస్త నిర్మాణాలతో తెలంగాణ సచివాలయం ప్రజల అవసరాలను తీర్చలేకపోతోందని ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. కొత్త సచివాలయం అందుబాటులోకి వస్తే..ప్రజలందరికీ ఓకేచోట నుంచి సేవలు అందించే అవకాశముంటుందన్నారు. సచివాలయ భవనం కూల్చివేత నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ప్రతిపక్షాల ఆరోపణలకు....

Published : 08 Jul 2020 00:38 IST

ఎంపీ వినోద్‌ కుమార్‌

హైదరాబాద్‌: అస్తవ్యస్త నిర్మాణాలతో తెలంగాణ సచివాలయం ప్రజల అవసరాలను తీర్చలేకపోతోందని తెరాస నేత, ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. కొత్త సచివాలయం అందుబాటులోకి వస్తే.. ప్రజలందరికీ ఒకేచోట నుంచి సేవలు అందించే అవకాశముంటుందన్నారు. సచివాలయ భవనం కూల్చివేత నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ప్రతిపక్షాల ఆరోపణలకు కాళేశ్వరం ప్రాజెక్టు సరైన సమాధానం చెప్పిందని, అలాగే కొత్త సచివాలయ భవనం అందుబాటులోకి వచ్చాక తాజా ఆరోపణలకు కూడా సరైన సమాధానం లభిస్తుందని తెలిపారు

ఇవాళ తెల్లవారుజాము నుంచి భారీ పోలీసు బందోబస్తు నడుమ తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు భారీ స్థాయిలో విమర్శలు సంధించాయి. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో బాధాకరమైన రోజని, ముఖ్యమంత్రి కేసీఆర్ మూఢ నమ్మకాల కోసం నాలుగు కోట్ల  మంది ప్రజలను పణంగా పెట్టారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం తప్పులు చేస్తే న్యాయవ్యవస్థ కలుగజేసుకునేది.. తెలంగాణ చరిత్రలో ఈ రోజును బ్లాక్‌ డే గా కాంగ్రెస్‌ నేతలు అభివర్ణించారు.ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి నిధులు లేవంటూ..రూ.500 కోట్లతో సచివాలయం నిర్మాణం అవసరమా?అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని