బలగాల ఉపసంహరణపై వివరణ ఇవ్వండి

భారత్‌-చైనా సరిహద్దుల్లోని ఏయే ప్రాంతాల నుంచి ఎక్కడి వరకు చైనా సైన్యం వెనక్కు వెళ్లిందో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌..

Published : 09 Jul 2020 01:21 IST

దిల్లీ: భారత్‌-చైనా సరిహద్దుల్లోని ఏయే ప్రాంతాల నుంచి ఎక్కడి వరకు చైనా సైన్యం వెనక్కు వెళ్లిందో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పి.చిదంబరం బుధవారం డిమాండ్ చేశారు. రెండు నెలలపాటు తీవ్ర ప్రతిష్టంభన అనంతరం వివాదానికి కేంద్ర బిందువులుగా ఉన్న హాట్‌ స్ప్రింగ్స్‌, గోగ్రా ప్రాంతాల నుంచి ఇరు దేశాల బలగాలు వెనక్కి వెళుతున్నాయి.  పాంగాంగ్ సరస్సు వద్ద కూడా స్వల్పంగా తమ బలగాలను చైనా ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో చైనా బలగాలు ఎక్కడ వరకు వచ్చాయి, తిరిగి ఎంత దూరం వెనక్కు వెళ్లాయి అనే దానిపై కేంద్రం వివరణ ఇవ్వాలని చిదంబరం కోరారు.

‘‘చైనా బలగాలు వెనక్కు వెళ్లడాన్ని నేను స్వాగతిస్తున్నాను. అయితే చైనా సైన్యం ఖచ్చితంగా ఏయే ప్రాంతాల నుంచి వెనక్కు వెళ్లింది, ప్రస్తుతం వారు ఎక్కడ ఉన్నారనే విషయాన్ని ఎవరైనా మాకు చెబుతారా.  వాస్తవాధీన రేఖను దాటి ఎవరు పొరుగు దేశం భూభాగంలోకి ప్రవేశించారు’’ అని ట్విటర్లో ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం తప్పనిసరి ఎందుకంటే భారత ప్రజలు జూన్‌ 15న ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారు అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని