కమల్‌హాసన్‌ ఆస్తులు రూ.176.93 కోట్లు 

ఎంఎన్‌ఎం అధ్యక్షుడు తన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో రూ.176.93 కోట్లుగా పేర్కొన్నారు.

Updated : 16 Mar 2021 13:27 IST

 విద్యార్హత 8వ తరగతి

చెన్నై: ఎంఎన్‌ఎం అధ్యక్షుడు తన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో రూ.176.93 కోట్లుగా పేర్కొన్నారు. సోమవారం కమల్‌హాసన్‌ కోయంబత్తూర్‌ (దక్షిణం) నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. స్థిరాస్తులు రూ.131.84 కోట్లు, చరాస్తులు రూ.45.09 కోట్లుగా తెలిపారు. లండన్‌లో రూ.2.50 కోట్ల ఇలు,్ల రూ.2.7 కోట్ల లెక్సస్‌ కారు, రూ.కోటి విలువైన బీఎమ్‌డబ్ల్యూ కారు ఉన్నాయన్నారు. రూ.49.5 కోట్ల అప్పులు ఉండగా, ఆయన విద్యార్హతను 8వ తరగతిగా పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని