TPCC అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతలు

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గాంధీభవన్‌లో ఆయన ఉత్తమ్‌కుమార్‌ నుంచి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు

Updated : 07 Jul 2021 14:21 IST

హైదరాబాద్‌: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. గాంధీభవన్‌లో ఆయన ఉత్తమ్‌కుమార్‌ నుంచి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. పదవీ బాధ్యతల కార్యక్రమంలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు గీతారెడ్డి, దామోదర రాజనర్సింహా, సీతక్క, సీనియర్‌ నేతలు నాగం జనార్దన్‌రెడ్డి, పొన్నాల లక్ష్యయ్య సహా కొత్త కార్యవర్గ సభ్యులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డికి వేద పండితులు ఆశీర్వచనం అందించారు. పీసీసీ బాధ్యతలకు సంబంధించిన పత్రాలపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపిన నేతలు.. కాంగ్రెస్‌కు పునర్వైభవం తేవాలని ఆకాక్షించారు.

అంతకుముందు రేవంత్‌ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడిలో పూజలు చేశారు. అనంతరం నాంపల్లిలోని దర్గాకు ర్యాలీగా బయలుదేరి అక్కడ చాదర్ సమర్పించారు. అక్కడి నుంచి గాంధీ భవన్‌కు చేరుకున్న రేవంత్‌ టీపీసీసీ పగ్గాలు చేపట్టారు. రేవంత్‌రెడ్డి బాధ్యతల స్వీకరణతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి గాంధీభవన్‌కు చేరుకున్న ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు సందడి చేశారు.   


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని