
Purandeswari: కాంగ్రెస్‌పై పురందేశ్వరి ఘాటు వ్యాఖ్యలు
ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర దుమారం
జగదల్‌పుర్: భాజపా ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌ను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఛత్తీస్‌గఢ్ భాజపా వ్యవహారాల ఇంఛార్జిగా ఉన్న పురందేశ్వరి జగదల్‌పుర్‌లో పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘చింతన్ శివిర్’ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భాజపా కార్యకర్తలు ఉమ్మితే.. బఘేల్, ఆయన మంత్రివర్గం కొట్టుకుపోతుందని వ్యాఖ్యానించారు. 2023లో భాజపాను అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. బఘేల్ స్పందిస్తూ ఆకాశంపై ఎవరైనా ఉమ్మితే అది వారి ముఖంపైనే పడుతుందన్నారు. పురందేశ్వరి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు బాగానే ఉన్నారని, భాజపాలోకి చేరాక ఆమె మానసిక స్థితి దిగజారిపోయిందని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.