Congress: రూ.4 లక్షల పరిహారానికి కాంగ్రెస్‌ ఆన్‌లైన్‌ ఉద్యమం

దేశంలో కరోనా కారణంగా చనిపోయినవారి కుటుంబాలను ఆదుకునేందుకు రూ.4 లక్షల వంతున పరిహారాన్ని అందించాలనే డిమాండుతో

Published : 05 Dec 2021 12:37 IST

ప్రభుత్వం నిద్రమత్తులో ఉందన్న రాహుల్‌ 

దిల్లీ: దేశంలో కరోనా కారణంగా చనిపోయినవారి కుటుంబాలను ఆదుకునేందుకు రూ.4 లక్షల వంతున పరిహారాన్ని అందించాలనే డిమాండుతో కాంగ్రెస్‌ పార్టీ ఆన్‌లైన్‌ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ శనివారం ఈ ఉద్యమాన్ని ట్విటర్లో ప్రారంభిస్తూ.. ప్రజలంతా తీవ్ర కష్టనష్టాలు ఎదుర్కొంటుంటే ప్రభుత్వం నిద్రమత్తులో ఉందని విమర్శించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని తట్టి లేపాల్సిన అవసరం ఉందన్నారు. కరోనాతో దేశంలో ఎంతమంది చనిపోయారనే కచ్చితమైన లెక్కల్ని ప్రభుత్వం వెల్లడించాలని, అలాంటివారి కుటుంబాలన్నింటికీ పరిహారం చెల్లించాలనీ డిమాండ్‌ చేశారు. మృతుల సంఖ్యను తగ్గించి చూపడం ద్వారా ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ఆదుకొనే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని, మృతుల వివరాలు కావాలంటే వాటిని ప్రభుత్వానికి ఇచ్చేందుకు యావద్దేశం సిద్ధంగా ఉందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా చెప్పారు. విపత్తు నిర్వహణ మార్గదర్శకాల ప్రకారం రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాల్సి ఉంటే కేవలం రూ.50,000తో సరిపెట్టేయాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని