Updated : 05/12/2021 12:38 IST

Uttar Pradesh: కొత్త ఫ్రంట్‌ వైపు ఎస్పీ చూపు 

మమత ప్రయత్నాలకు చేయూత : అఖిలేశ్‌ 

లఖ్‌నవూ, ముంబయి: ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కొత్త సమీకరణాలకు తెరలేస్తోంది. ఇంతవరకు కాంగ్రెస్‌తో కలిసి అడుగులు వేస్తుందని భావిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ ఆకస్మికంగా మాట మార్చింది. కాంగ్రెస్‌ కూటమికి ప్రత్యామ్నాయంగా కొత్త ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్న పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతకు చేయూతనందించాలని ఎస్పీ భావిస్తోంది. ఒకే ప్రయత్నంతో అటు కాంగ్రెస్‌ని, ఇటు యూపీలో అధికారంలో ఉన్న భాజపాను దెబ్బ కొట్టాలనేది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ‘యూపీలో అధికార పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. బెంగాల్‌లో తృణమూల్‌ చేతిలో భాజపా ఎలా ఓడిపోయిందో ఇప్పుడు యూపీలో అలాగే తుడిచిపెట్టుకుపోతుంది. ఈసారి కాం గ్రెస్‌కి వచ్చే సీట్లు సున్నా’ అని అఖిలేశ్‌ చెబుతున్నారు.

కాంగ్రెస్‌ని పక్కనపెట్టేస్తే భాజపాకే లబ్ధి: సేన 

పురాతన పార్టీ అయిన కాంగ్రెస్‌ను జాతీయ రాజకీయాల నుంచి పక్కనపెట్టి విపక్ష కూటమిని ఏర్పాటు చేయాలని భావించడమంటే పరోక్షంగా అది భాజపాను, ఫాసిస్టు శక్తుల్ని బలోపేతం చేయడమేనని శివసేన పేర్కొంది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏను వద్దనుకుంటున్నవారు ఆ వైఖరిని బాహాటంగా స్పష్టం చేయాలని ‘సామ్నా’ సంపాదకీయం ద్వారా సేన తెలిపింది. విపక్షాల్లో ఐక్యత లేకపోతే భాజపాకి రాజకీయ ప్రత్యామ్నాయం కష్టమవుతుందని అభిప్రాయపడింది. కొన్ని పార్టీలకు కాంగ్రెస్‌తో విభేదాలున్నా ఇప్పటికీ యూపీఏ కూటమి.. ముందుకు వెళ్లడం సాధ్యమేనంది.

కాంగ్రెస్‌ వైఫల్యంతోనే ప్రత్యామ్నాయం: తృణమూల్‌

కోల్‌కతా: భాజపాపై పోరాటానికి నాయకత్వం వహించడంలో కాంగ్రెస్‌ వైఫల్యం చెందడంతోనే ప్రత్యామ్నాయ కూటమివైపు దృష్టి సారించాల్సి వచ్చిందని తృణమూల్‌ కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. ‘కాంగ్రెస్‌ లేని విపక్ష కూటమిని నెలకొల్పుతామంటూ మేమెప్పుడూ చెప్పలేదు. కాంగ్రెస్‌ తన విధుల్ని నిర్వర్తించనప్పుడు ఆ అసమర్థతకు మమ్మల్ని నిందించకూడదు. ఒకరు విఫలమైతే మరొకరు ఆ స్థానాన్ని భర్తీ చేయాలి’ అని తృణమూల్‌ ఎంపీ సౌగతా రాయ్‌ చెప్పారు. 

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని