Ts News: ప్రపంచం ఆశ్చర్యపోయేలా నిర్మిస్తామన్నారు.. ఏడేళ్లు గడిచినా..: రేవంత్‌రెడ్డి

ప్రపంచం ఆశ్చర్యపోయేలా తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని నిర్మిస్తామని చెప్పి ఏడేళ్లు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

Updated : 11 Dec 2021 17:31 IST

హైదరాబాద్: ప్రపంచం ఆశ్చర్యపోయేలా తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని నిర్మిస్తామని చెప్పి ఏడేళ్లు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సచివాలయం ఎదుట నిర్మాణంలో ఉన్న అమరవీరుల స్మారక భవనాన్ని రేవంత్ రెడ్డి పరిశీలించారు. భవన నిర్మాణానికి సంబంధించిన వివరాలను  అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇచ్చిన హామీ మేరకు అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం, భూమి, ఒకరికి ఉద్యోగం ఇప్పటికీ ఇవ్వలేదని అగ్రహం వ్యక్తం చేశారు. అమరవీరుల స్తూపం నిర్మాణం కోసం 2017లో రూ.80 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం.. 2018లో టెండర్లు పిలిచినట్లు చెప్పారు. టీ హబ్‌ నిర్మాణంలో కోట్ల రూపాయలు కొల్లగొట్టిందని కాగ్ చెప్పిన అదే సంస్థకు ప్రభుత్వం నిర్మాణ పనులను అప్పగించిందని ఆక్షేపించారు. ఏపీకి చెందిన గుత్తేదారుకు పనులు అప్పగించినందుకు సీఎం క్షమాపణ చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని