TS News : కరీంనగర్‌ పోలీసు ట్రైనింగ్‌ సెంటర్‌ వద్ద భాజపా కార్యకర్తల ఆందోళన..

తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317జీవోకు నిరసనగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన

Updated : 03 Jan 2022 13:43 IST

కరీంనగర్‌ :  తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317జీవోకు నిరసనగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన దీక్షను నిన్న రాత్రి పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను మానకొండూర్‌ నుంచి కరీంనగర్‌లోని పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు తరలించారు. అయితే పోలీసుల తీరును నిరసిస్తూ భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసు ట్రైనింగ్‌ సేంటర్‌ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న కార్యకర్తలు.. సీపీ సత్యనారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణ నెలకొంది. పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బండి సంజయ్‌ దీక్షలో కొవిడ్‌ నిబంధనలు పాటించలేదని.. మాస్కులు ధరించని 25 మందిపై కేసు నమోదు చేశామని సీపీ సత్యనారాయణ తెలిపారు. బండి సంజయ్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. బండిసంజయ్‌ను కరీంనగర్‌ కోర్టుకు తరలించామని సీపీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని