AP News: కొడాలి నాని, డీజీపీపై తీవ్ర వ్యాఖ్యలు.. బుద్దా వెంకన్న ఇంటికి పోలీసులు

తెదేపా నేత బుద్దా వెంకన్న ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈరోజు ఉదయం మీడియా సమావేశంలో మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై

Published : 24 Jan 2022 17:15 IST

విజయవాడ: తెదేపా నేత బుద్దా వెంకన్న ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈరోజు ఉదయం మీడియా సమావేశంలో మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన చేసిన నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్‌ చేసే అవకాశముంది. సంక్రాంతికి గుడివాడలో క్యాసినో నిర్వహించారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. ఆ క్యాసినోలో డీజీపీ వాటా ఉన్నందునే మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవడం లేదంటూ బుద్దా వెంకన్న ఈ ఉదయం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

దీంతో పాటు తెదేపా అధినేత చంద్రబాబు ఇంటివైపు వస్తే కొడాలి నానిని చంపడానికైనా.. తాను చావడానికైనా సిద్ధమని బుద్దా వ్యాఖ్యానించారు. తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన్ను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సరైన సమాధానం రాకపోతే బుద్దా వెంకన్నను అరెస్ట్‌ చేసే అవకాశముంది. దీనిలో భాగంగా ఆయన నివాసం వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. మరోవైపు బుద్దా వెంకన్నను అరెస్ట్ చేస్తారనే వార్తల నేపథ్యంలో పెద్ద ఎత్తున తెదేపా నేతలు, కార్యకర్తలు ఆయన నివాసం వద్దకు చేరుకుంటున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని