Andhra News: ప్రజలు గౌరవంగా జీవించడం ఈ ప్రభుత్వానికి నచ్చడం లేదనుకుంటా: పవన్‌

ప్రజల మంచి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేస్తున్నట్లు కనిపించడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. కాకినాడ, కర్నూలు నగరపాలక సంస్థల పరిధిలో ఆస్తి, చెత్త పన్నులకు సంబంధించి జరిగిన వ్యవహారాలపై ఆయన ట్విట్ చేశారు. పన్ను కట్టకపోతే...

Updated : 19 Mar 2022 05:07 IST

అమరావతి: ప్రజల మంచి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేస్తున్నట్లు కనిపించడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. కాకినాడ, కర్నూలు నగరపాలక సంస్థల పరిధిలో ఆస్తి, చెత్త పన్నులకు సంబంధించి జరిగిన వ్యవహారాలపై ఆయన ట్విట్ చేశారు. పన్ను కట్టకపోతే సామాన్లు పట్టుకుపోతామని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ట్రాక్టర్లు వేసుకొని తిరగడం ఏం సూచిస్తోందని ప్రశ్నించారు. ఫైనాన్స్ వ్యాపారం చేసుకొనేవాళ్ళ మాదిరిగా ప్రభుత్వ వైఖరి ఉందని మండిపడ్డారు. చెత్త సేకరణకు పన్ను విధించటమే ఒక దౌర్భాగ్యం అనుకొంటే... దాన్ని వసూలు చేస్తున్న విధానం మరింత దిగజారిపోయేలా ఉందన్నారు. కర్నూలులో వ్యాపారులు చెత్త పన్ను చెల్లించలేదని దుకాణాల ముందు చెత్తను వేసి అవమానిస్తారా అని ధ్వజమెత్తారు. ఇది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రజలు గౌరవప్రదంగా జీవించడం ఈ ప్రభుత్వానికి నచ్చడం లేదని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని