TRS Party: పీకే ‘ఐప్యాక్‌’ సేవలు కొనసాగింపునకు తెరాస నిర్ణయం

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ నేతృత్వంలోని ‘ఐప్యాక్‌’ సేవలను కొనసాగించాలని తెరాస నిర్ణయించింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం

Updated : 25 Apr 2022 03:56 IST

హైదరాబాద్‌: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) నేతృత్వంలోని ‘ఐప్యాక్‌’ సేవలను కొనసాగించాలని తెరాస నిర్ణయించింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఆ సంస్థ సేవలను అందించనుంది. ఈ విషయంపై తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌తో రెండురోజులుగా ప్రశాంత్‌కిశోర్‌ చర్చలు జరిపారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ వేదికగా వీరి చర్చలు సుదీర్ఘంగా కొనసాగాయి. 

సర్వేలు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, కొత్త ఓటర్లను ప్రభావితం చేయడం ఇతరత్రా వాటి కోసం ఈ ఐప్యాక్‌ సేవలు అందించనుంది. రెండో రోజూ సుదీర్ఘంగా సాగిన సమావేశంలో రాష్ట్ర, జాతీయ రాజకీయాలపైనా కేసీఆర్‌, ప్రశాంత్‌కిశోర్‌ చర్చించినట్లు సమాచారం. జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయం లేకపోతే కూటమి లేదా కేసీఆర్‌ కొత్త పార్టీ ఏర్పాటుపై చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఇతర నేతల పట్ల ప్రజాభిప్రాయంపై సర్వేలను ఈ సందర్భంగా కేసీఆర్‌, పీకే చర్చించినట్లు సమాచారం. కాంగ్రెస్‌లో పీకే చేరనున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆయనతో కేసీఆర్‌ రెండురోజులుగా భేటీ కావడం చర్చనీయాంశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని