Rahul Gandhi: చంచల్‌గూడ జైలులో ములాఖత్‌.. రాహుల్‌కు అనుమతి

తెలంగాణ పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. మరికాసేపట్లో చంచల్‌గూడ జైలుకు వెళ్లనుననారు.

Updated : 07 May 2022 12:44 IST

హైదరాబాద్‌ : తెలంగాణ పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. మరికాసేపట్లో చంచల్‌గూడ జైలుకు వెళ్లనున్నారు. జైలులో ఎన్‌ఎస్‌యూఐ నేతలను పరామర్శించనున్నారు. ఈ మేరకు చంచల్‌గూడ జైలులో ములాఖత్‌కు జైలు అధికారులు అనుమతిచ్చారు. అయితే.. రాహుల్‌గాంధీతోపాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలకు మాత్రమే జైలు అధికారులు అనుమతి మంజూరు చేశారు. మధ్యాహ్నం 12.30-12.45 గంటల మధ్య కలిసేందుకు వీరికి అనుమతి లభించింది. ఇటీవల ఓయూలో ధర్నా చేసిన ఎన్‌ఎస్‌యూఐ నేతలను అరెస్టు చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని