GVL : అల్లర్లు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా.. కావాలని చేసిన పనా..? : జీవీఎల్‌

రాష్ట్రంలో వైకాపా చేతగానితనంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మండిప్డారు. వైకాపా ప్రభుత్వం స్టిక్కర్లు అతికించుకునే పనిచేస్తోందని ఎద్దేవా చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

Updated : 27 May 2022 14:34 IST

విశాఖ: రాష్ట్రంలో వైకాపా చేతగానితనంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం స్టిక్కర్లు అతికించుకునే పని చేస్తోందని ఎద్దేవా చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘పాలన చేతకాదని తేలిపోయింది.. మీరు గద్దె దిగండి. దావోస్‌లో రాష్ట్ర బృందంపై విమర్శలకు సమాధానం చెప్పాలి. అమలాపురంలో అల్లర్లు సృష్టించారు. అల్లర్లు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా.. కావాలని చేసిన పనా?.. యాత్ర పేరుతో స్పీకర్‌ రాజకీయ వ్యాఖ్యలు చేయడం తగదు. స్పీకర్‌ పదవికి రాజీనామా చేసి.. వ్యాఖ్యలు చేసుకోవచ్చు’’ అని జీవీఎల్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని