Chandrababu-Modi: అప్పుడప్పుడు దిల్లీకి రండి: చంద్రబాబుతో ప్రధాని మోదీ

రాష్ట్రపతి భవన్‌ సాంస్కృతిక మందిరంలో జరిగిన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం జాతీయ కమిటీ సమావేశం ముగిశాక చంద్రబాబు ప్రధానితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

Updated : 07 Aug 2022 08:04 IST

దిల్లీ: రాష్ట్రపతి భవన్‌ సాంస్కృతిక మందిరంలో జరిగిన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం జాతీయ కమిటీ సమావేశం ముగిశాక చంద్రబాబు ప్రధానితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. హాజరైన ప్రముఖులంతా తేనీరు సేవిస్తుండగా, ప్రధాని అందరి వద్దకు వచ్చి పలకరించినట్లు తెలిసింది. చంద్రబాబు దగ్గరకు వచ్చినప్పుడు కొద్దిసేపు పక్కకు జరిగి ఇద్దరూ 5 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. ‘మీరీ మధ్య దిల్లీకి రావడంలేదు. అప్పుడప్పుడూ వస్తూ ఉండండి’ అని బాబుతో ప్రధాని అన్నట్లు తెదేపా వర్గాలు తెలిపాయి. ఈ సారి దిల్లీకొచ్చినప్పుడు ప్రత్యేకంగా కలుస్తానని చంద్రబాబు చెప్పగా, ‘తప్పకుండా రండి. ఇది మీ ఇల్లు అనుకోండి. రావాలనుకున్నప్పుడు ముందుగా మా ఆఫీసుకు చెప్పండి’ అన్నట్లు సమాచారం. చంద్రబాబు కుటుంబసభ్యుల యోగక్షేమాలను అడిగినట్లు తెలిసింది. కేంద్ర మంత్రులు అమిత్‌ షా, గడ్కరీ తదితరులతోనూ బాబు ప్రత్యేకంగా మాట్లాడారని తెదేపా వర్గాలు చెప్పాయి.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని