గతాన్ని విస్మరించి తప్పుడు ప్రచారం తగదు

భారత దేశానికి స్వాతంత్య్రం రాకముందు కాంగ్రెస్‌ నాయకులు, ప్రజలు ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేశారని.. భాజపా నాయకులు మాత్రం గతాన్ని విస్మరించి ఈ తరానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు

Updated : 09 Aug 2022 06:52 IST

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ పొన్నం

జమ్మికుంట గ్రామీణం, న్యూస్‌టుడే: భారత దేశానికి స్వాతంత్య్రం రాకముందు కాంగ్రెస్‌ నాయకులు, ప్రజలు ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేశారని.. భాజపా నాయకులు మాత్రం గతాన్ని విస్మరించి ఈ తరానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఇల్లందకుంట శ్రీసీతారామ చంద్రస్వామివారిని సోమవారం ఆయన దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కల్యాణ మండపం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎనిమిదేళ్ల భాజపా పాలనలో దేశంలో నిరుద్యోగ సమస్య ఎక్కువైందన్నారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో గతంలో తాను చేసిన అభివృద్ధి తప్ప ప్రస్తుత ఎంపీ చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడానికి కారణం భాజపా నాయకుల స్వార్థమేనని ఆరోపించారు. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సిద్ధాంతాల గురించి మాట్లాడే నైతికహక్కు లేదన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు నేటి నుంచి ఈ నెల 18 వరకు కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు శాసన సభ నియోజక వర్గాలు, 14 మండలాలు, 70 గ్రామాల మీదుగా 150 కిలోమీటర్ల మేర కాంగ్రెస్‌ పాదయాత్ర కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బల్మూరి వెంకట్‌, కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి, నాయకులు ఇంగ్లే రామారావు, కనుమల్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వీఆర్‌ఏల సమ్మెకు మద్దతు
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ  ఇల్లందకుంట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్‌ఏల సమ్మె శిబిరాన్ని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బల్మూరి వెంకట్‌, కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి సందర్శించి మద్దతు తెలిపారు.

 

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts