Venkaiah Naidu: ఆ రోజు నా కళ్లల్లో నీళ్లు వచ్చాయి: వెంకయ్యనాయుడు

ఎన్ని విభేదాలు, వైరుద్ధ్యాలు ఉన్నా మనమంతా భారతీయులమేనని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. 

Updated : 09 Aug 2022 09:27 IST

దిల్లీ: ఎన్ని విభేదాలు, వైరుద్ధ్యాలు ఉన్నా మనమంతా భారతీయులమేనని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓర్పు ఉండాలని.. ప్రజాతీర్పును సహించే ఓపిక ఉండాలని చెప్పారు. రాజ్యసభ, స్థానిక జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో సోమవారం తనకు ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడారు. 

‘‘ప్రభుత్వానికి మెజార్టీ ఉన్నా.. ప్రతిపక్షానికి చెప్పే అవకాశం ఇవ్వాలి. నన్ను ఉప రాష్ట్రపతిగా ఎంపిక చేశామని ఐదేళ్ల కిందట ప్రధాని ప్రకటించినప్పుడు నా కళ్లలో నీళ్లు వచ్చాయి. ఈ పదవిని నేను అడగలేదు.  పార్టీ అప్పగించిన బాధ్యతలను శిరసావహిస్తూ భాజపాకు రాజీనామా చేశాను. నాకు ఇంతటిస్థాయి ఇచ్చిన పార్టీకి రాజీనామా చేయాల్సి రావడం కన్నీళ్లు తెప్పించింది. ఒకప్పుడు జట్కాలో ఊరంతా తిరుగుతూ.. వాజ్‌పేయీ సమావేశాల గురించి మైక్‌లో ప్రచారం చేసేవాణ్ని. పోస్టర్లు అతికించేవాడిని. అలాంటి నేను భాజపా అధ్యక్షుడినై వాజ్‌పేయీ, ఆడ్వాణీల మధ్య కూర్చుంటానని కలగనలేదు’’ అని వెంకయ్య నాయుడు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని