Cm Kcr: బీఆర్ఎస్ మొదటి కార్యక్షేత్రం మహారాష్ట్ర, కర్ణాటక: సీఎం కేసీఆర్
దేశాన్ని 75 ఏళ్లుగా ఏలిన పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తున్నట్టు ప్రకటించిన అనంతరం పార్టీ శ్రేణులనుద్దేశించి కేసీఆర్ మాట్లాడారు.
హైదరాబాద్: దేశాన్ని 75 ఏళ్లుగా ఏలిన పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తున్నట్టు ప్రకటించిన అనంతరం పార్టీ శ్రేణులనుద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ.. దేశ ప్రజల ప్రయోజనాల కోసమే భారాస ఆవిర్భవిస్తోందని చెప్పారు. తెలంగాణ కోసం కష్టపడినట్లే దేశం కోసం పనిచేస్తామన్నారు. దేశ వ్యాప్తంగా తెలంగాణ మోడల్ అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర తమ మొదటి కార్యక్షేత్రాలని తెలిపారు. రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌తో కలిసి భారాస జెండా ఎగురవేస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
‘‘జాతీయ పార్టీ పెట్టాలన్నది ఆషామాషీ నిర్ణయం కాదు. బలమైన పునాదులపైనుంచే జాతీయ పార్టీ నిర్ణయం తీసుకున్నాం. కుల, లింగ వివక్షలు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. అభివృద్ధిలో మహిళలు, ఎస్సీలు భాగం కాలేకపోతున్నారు. దళిత జనోద్దరణ కోసమే దళితబంధు కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. దేశ రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసేందుకే జాతీయ పార్టీ ద్వారా ముందడుగు వేశాం. దేశ ప్రజల సమస్యలనే అజెండాగా జాతీయ పార్టీ జెండాతో వెళ్తున్నాం. తెలంగాణ సీఎంగా ఉంటూనే దేశమంతా పర్యటిస్తా. కార్యక్షేత్రం వదలం..ఎవరికీ అనుమానం అక్కర్లేదు’’ అని కేసీఆర్ వివరించారు.
రైతు సంక్షేమమే ప్రధాన అజెండా..
దేశంలో చాలా పార్టీలకు రాజకీయం ఒక క్రీడలా మారిపోయిందని, కానీ తనకు అది ఒక టాస్క్ వంటిదని చెప్పారు. దేశంలో రైతుల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందన్న కేసీఆర్.. దేశంలో అనేక ప్రాంతాలు తిరిగినప్పుడు తెలంగాణకే పరిమితం కావొద్దని చాలా మంది తనను కోరారన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, తెలంగాణ మోడల్ దేశంలో అమలు కావాలని చెప్పారు. రైతు సంక్షేమమే తమ పార్టీ ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు. విదేశాల నుంచి ప్రాసెసింగ్ ఫుడ్ దిగుమతి చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ములాయం సింగ్ యాదవ్ ఐసీయూలో ఉన్నందున ఈ సమావేశానికి అఖిలేష్ యాదవ్‌ను తానే రావొద్దని చెప్పినట్టు కేసీఆర్ తెలిపారు. భారాస ఆవిర్భావ కార్యక్రమానికి కలుద్దామని అఖిలేష్, తేజస్వీ యాదవ్‌కు చెప్పానని వెల్లడించారు. కలిసి ముందుకు సాగడానికి దేశ వ్యాప్తంగా అనేక పార్టీల నేతలు ముందుకొస్తున్నారని వివరించారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై ఆర్థిక శాస్త్రవేత్తలు, పలు రంగాల నిపుణులతో అనేక దఫాలు చర్చలు జరిపామని కేసీఆర్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉందని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
మహారాష్ట్రలోని బారామతిలో ఉత్కంఠ పోరు నెలకొంది. పవార్ కుటుంబంలోని ఇద్దరు మహిళలు పరస్పరం తలపడటం ఉత్కంఠ రేపుతోంది. -
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎన్డీఏ కూటమి నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. -
తెదేపా అభ్యర్థులకు ఈనెల 21న బీఫామ్‌లు ఇవ్వనున్న చంద్రబాబు
తెలుగుదేశం అభ్యర్థులకు అధినేత చంద్రబాబు ఈనెల 21న బీఫామ్‌లు అందజేయనున్నారు. -
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా నారా లోకేశ్ నామినేషన్ దాఖలు చేశారు. -
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
రాష్ట్రానికి ఇప్పటివరకు భాజపా ఏం చేసిందో చెప్పాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
భీమిలి, జీడీ నెల్లూరు నియోజకవర్గాలకు చెందిన పలువురు వైకాపా నేతలు తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు. -
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్‌రెడ్డి
గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. -
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
వైఎస్ఆర్ హయంలో హంద్రీనీవా ప్రాజెక్టు 90 శాతం పూర్తి అయిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అధికారంలోకి వస్తే ప్రాజెక్టు పూర్తి చేసి -
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
మాజీ మంత్రి వివేకానందరెడ్డి 40 ఏళ్లుగా ఈ ప్రాంతానికి సేవ చేశారని ఆయన కుమార్తె సునీత అన్నారు. వివేకాను అత్యంత దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీలతో ఆర్వో కార్యాలయాల వద్దకు చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు. -
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అధికార పార్టీకి చెందిన గూండాలు అరాచకం సృష్టించారు. -
కేసీఆర్‌ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
కాంగ్రెస్‌కు రాష్ట్రం, రైతుల కంటే రాజకీయాలే ముఖ్యమని స్పష్టమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్‌రెడ్డి
ఎవరూ ఊహించని రీతిలో అత్యధిక స్థానాల్లో భాజపా (BJP) విజయం సాధించబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. -
ఉత్తర్‌ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్‌పుర్ లోక్‌సభ స్థానం నుంచి తెలంగాణ మహిళ శ్రీకళారెడ్డి పోటీచేస్తున్నారు. -
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ తెదేపా అభ్యర్థి బొండా ఉమాను ఇరికించాలని కుట్రలు చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
అధికారంలో ఉన్న అయిదేళ్లు వైకాపా పెద్దగా చేసిందేమీ లేకపోవడంతో ప్రచారంలో ఆ పార్టీ నేతల పనులు చూసి జనం నవ్వుకుంటున్నారు. -
వాల్తేరు క్లబ్లో వైకాపా డిష్యుం డిష్యుం!
వాల్తేరు క్లబ్ ప్రభుత్వ భూమి. ఈ రోజుకూ నేను అదే చెబుతున్నా. ఏ రోజైనా ఒక సామాజికవర్గం చేతిలో ఉండి ఉండొచ్చు. -
నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ఏపీ, తెలంగాణలో నేటి నుంచే నామినేషన్లు
నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలకు (Lok sabha Elections) నోటిఫికేషన్ వెలువడింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. -
చీకటి పాలనకు చిరునామా.. జగనన్న కాలనీలు!
ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తాం.. అంటూ జగనన్న కాలనీల విషయంలో సీఎం జగన్ మొదటి నుంచీ గొప్పలు చెబుతున్నారు. -
వ్యూహకర్తలదే పెత్తనం!.. ప్రచారంలో పార్టీలను శాసించేది వారే
భారత రాజకీయాల్లో వ్యూహకర్తల పెత్తనం పెరిగిపోయింది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించే రోజులు పోయాయి. ప్రచారం మొత్తాన్ని వ్యూహకర్తలే శాసించే రోజులు వచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌సింగ్ ఏఐ వీడియో వైరల్
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ