హామీల పేరుతో మోసం: బాబుమోహన్
కేంద్రం నిధులతోనే గ్రామాలు అభివృద్ధి పథంలో కొనసాగుతున్నాయని అందోలు మాజీ ఎమ్మెల్యే, భాజపా నాయకులు బాబుమోహన్ తెలిపారు.
టేక్మాల్‌లో ద్విచక్ర వాహన ర్యాలీ
టేక్మాల్, న్యూస్‌టుడే: కేంద్రం నిధులతోనే గ్రామాలు అభివృద్ధి పథంలో కొనసాగుతున్నాయని అందోలు మాజీ ఎమ్మెల్యే, భాజపా నాయకులు బాబుమోహన్ తెలిపారు. ప్రజా గోస-భాజపా భరోసా కార్యక్రమంలో భాగంగా టేక్మాల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో చేసిన ప్రగతి ఏం లేదన్నారు. రెండు పడకలు గదులు కేటాయించడంలో విఫలమయ్యిందన్నారు. ఎన్నికల సమయంలో ఏదో ఒక బంధు ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఉపాధి హామీ పథకంలో మంజూరైన నిధులు కేంద్ర ప్రభుత్వానివేనన్నారు. పోడు భూముల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం జాప్యంపై ప్రశ్నించారు. ప్రస్తుతం టేక్మాల్ మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో పర్యటించానని అభివృద్ధికి దూరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భాజపా నాయకులు సురేందర్, ఎల్లుపేట రాజు, పద్మయ్య, దుర్గయ్య, కిష్టయ్య, రమేశ్, మహేశ్, సాయాగౌడ్, నాగరాజు, కృష్ణ కుమార్, బుచ్చయ్య, సుదర్శన్ మహేశ్, కుమార్ సేనాపతి తదితరులు ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Jamuna: ‘గుండమ్మ కథ’.. జమున కోసం మూడేళ్లు ఎదురు చూశారట..!
-
Movies News
Vishnu Priya: యాంకర్ విష్ణు ప్రియ ఇంట విషాదం
-
India News
Flight: అసహనంతో ‘విమానం హైజాక్’ అంటూ ట్వీట్
-
Movies News
Jamuna: అలనాటి నటి జమున కన్నుమూత
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Marriage: 28 ఏళ్ల కోడలిని పెళ్లాడిన 70 ఏళ్ల మామ