BRS: భారాసకు 18 మంది ఆదివాసీ సర్పంచుల రాజీనామా

కుమురం భీం జిల్లా వాంకిడి మండలానికి చెందిన 18 మంది ఆదివాసీ సర్పంచులు భారత్‌ రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు.

Updated : 28 Dec 2022 07:22 IST

వాంకిడి, న్యూస్‌టుడే: కుమురం భీం జిల్లా వాంకిడి మండలానికి చెందిన 18 మంది ఆదివాసీ సర్పంచులు భారత్‌ రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని భారాస మండల అధ్యక్షుడు అజయ్‌కుమార్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్పకు అందజేస్తామని చెప్పారు. వాంకిడిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఈ విషయం వెల్లడించారు. గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందన్న ఆశతో 2019లో అధికార పార్టీలో చేరామని, నేటివరకు ఎలాంటి ప్రగతి జరగలేదని అన్నారు.  తమ పదవీకాలం తొలినాళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు నేటికీ రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. ఈ విషయమై భారాస జిల్లా అధ్యక్షుడు, సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా..ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి వారికి నచ్చజెప్పి సమష్టిగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని