రాహుల్.. రాముడు, మహాపురుషుడు, తపస్వి: కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ పొగడ్తలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని రాముడితో పోల్చారు అదేపార్టీకి చెందిన సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్. అతనో యోగి, తపస్వి, మహాపురుషుడని వ్యాఖ్యానించారు.
మొరాదాబాద్, దిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని రాముడితో పోల్చారు అదేపార్టీకి చెందిన సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్. అతనో యోగి, తపస్వి, మహాపురుషుడని వ్యాఖ్యానించారు. ‘రాహుల్ రాముడి వంటివారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా భరతుడి లాంటివారు. కొన్నిసార్లు రాముడు వెళ్లలేని చోటుకు భరతుడు అతని పాదుకలను తీసుకెళ్లాడు. అలాగే, జోడోయాత్ర సందర్భంగా రాహుల్ ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటిస్తున్నా, అన్నిచోట్లకూ స్వయంగా వెళ్లలేరు. కాంగ్రెస్ కార్యకర్తలే భరతుడి మాదిరిగా ఆయన సందేశాన్ని రాష్ట్రమంతా తీసుకెళ్లాలి’ అని పిలుపునిచ్చారు.
జోడోయాత్రకు ఉత్తర్‌ప్రదేశ్ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న సల్మాన్ ఖుర్షీద్.. సోమవారం మొరాదాబాద్‌లో కార్యకర్తలతో సమీక్ష సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఖుర్షీద్ వ్యాఖ్యలపై భాజపా అధికార ప్రతినిధులు గౌరవ్ భాటియా, షెహజాద్ పూనావాలాలు మండిపడ్డారు. ‘కాంగ్రెస్ నేతలు దేశభక్తిని, దైవభక్తిని మించి కుటుంబ భక్తిని చాటుకున్నారు. హిందువుల మనోభావాలను గాయపరిచారు. వారు క్షమాపణలు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
భాజపా విమర్శలపై మంగళవారం స్పందించిన ఖుర్షీద్.. తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ‘దేవుడి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఆయన చూపిన మార్గాన్ని అనుసరించే వారిని కీర్తించడంలో తప్పేముంది? మంచిని చూడలేకపోవడం భాజపా నేతల లోపమైతే నేనేం చేయగలను’ అని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Indigo: హైదరాబాద్ నుంచి బయల్దేరిన విమానంలో ప్రయాణికుడి వింత ప్రవర్తన.. ఏం చేశాడంటే?
-
దంపతులను కారుతో ఢీ కొట్టిన నటుడు.. మహిళ మృతి
-
IAF: వాయుసేన హెలికాప్టర్లో సాంకేతిక లోపం.. పొలాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్!
-
Guntur: తెదేపా ‘మోత మోగిద్దాం’లో పాల్గొన్న వారిపై కేసు
-
KTR: బాల్క సుమన్ మంత్రి అయితే అద్భుతాలు చేస్తారు: కేటీఆర్
-
Turkey: తుర్కియే పార్లమెంట్ వద్ద ఆత్మాహుతి దాడి