BRS: ఏపీలో భారాస ఆవిర్భావ సభ
ఆంధ్రప్రదేశ్‌లో భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభను నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. దీనికి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ హాజరుకానున్నారు.
హాజరు కానున్న కేసీఆర్
ప్రగతిభవన్‌లో సీఎంతో ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ భేటీ
పార్టీ విస్తరణపై చర్చ
ఈనాడు, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభను నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. దీనికి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ హాజరుకానున్నారు. భారాస ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, పార్టీ నేత చింతల పార్థసారథిలు బుధవారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పార్టీ విస్తరణ, పటిష్ఠ నిర్మాణంపై చర్చించారు. త్వరలో సభా వేదిక, నిర్వహణ తేదీలను ఖరారు చేయనున్నారు. దేశంలో గుణాత్మక మార్పు సందేశాన్ని ప్రజల్లోకి ప్రబలంగా తీసుకెళ్లాలని కేసీఆర్ ఈ సందర్భంగా చంద్రశేఖర్‌కు సూచించారు. ఏపీ రాష్ట్ర కార్యాలయాన్ని వెంటనే ప్రారంభించాలని మార్గదర్శనం చేశారు. భారీఎత్తున సభ్యత్వ నమోదు చేపట్టాలని, నిర్మాణాత్మక వైఖరితో ముందుకొచ్చే వారిని పార్టీలో చేర్చుకోవాలన్నారు. పార్టీ గ్రామ, మండల, జిల్లా కమిటీల రూపకల్పన చేయాలని కేసీఆర్ చెప్పారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కేసీఆర్ నిర్దేశాల మేరకు ఏపీ భారాస ముందుకు సాగుతుందన్నారు. పార్టీపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి ఉందని, పెద్దఎత్తున చేరికలుంటాయని, ఇప్పటికే పలువురు సంప్రదిస్తున్నారని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
-
Sports News
WTC Final: కెన్నింగ్టన్ ఓవల్‌లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్ బ్రాడ్‌మన్ సరసన శార్దూల్
-
Movies News
RRR: ఎన్టీఆర్-రామ్‌చరణ్‌లతో నటించే అవకాశం వస్తే అది అదృష్టమే: హాలీవుడ్ స్టార్ హీరో
-
World News
Pakistan: బడ్జెట్ ప్రవేశపెట్టిన పాక్.. సగం అప్పులకే కేటాయింపు!
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/06/23)