Nitish kumar: ఆహ్వానం అందినా.. భారాస సభకు హాజరుకాలేక పోయేవాణ్ని: నీతీశ్‌కుమార్
తెలంగాణలోని ఖమ్మంలో భారాస ఆవిర్భావ బహిరంగ సభ జరిగిన మరుసటి రోజు బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పట్నా: తెలంగాణలోని ఖమ్మంలో భారాస ఆవిర్భావ బహిరంగ సభ జరిగిన మరుసటి రోజు బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయేతర పక్షాలతో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశం గురించి తనకు సమాచారం లేదన్న నీతీశ్ కుమార్.. ఆహ్వానం అందినా ‘సావధాన్ యాత్ర’, రాష్ట్ర (బిహార్) బడ్జెట్‌కు సంబంధించిన సమావేశాలు, ఇతర కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నందున ఆ సభకు హాజరుకాలేక పోయేవాణ్ని అని పేర్కొన్నారు.
భాజపా కూటమికి ప్రత్యామ్నాయంగా విపక్షాలన్నీ ఒకే వేదికపై రావాలని కోరుకుంటున్న నీతీశ్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గురువారం పట్నాలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘స్వప్రయోజనాలకోసం ఏమీ కోరుకోవడం లేదు. జాతి ప్రయోజనాల కోసం విపక్ష నేతలంతా ఏకతాటిపైకి వచ్చి ముందుకు సాగితే చూడాలని ఉంది. తెలంగాణలో జరిగింది బీఆర్‌ఎస్‌కు సంబంధించిన సభ మాత్రమే. కొత్తకూటమి ఏర్పాటుకోసం నిర్వహించిన సభగా దీన్ని చూడకూడదు. ఆహ్వానం అందుకున్న వారు ఆ సమావేశానికి హాజరయ్యారు’’ అని నీతీశ్ కుమార్ వ్యాఖ్యానించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Modi - Rahul: కాంగ్రెస్ ర్యాలీ వాయిదా..ఒకేరోజు మోదీ, రాహుల్ మీటింగ్స్
-
Politics News
CM KCR: నా రాజకీయ జీవితమంతా పోరాటాలే: సీఎం కేసీఆర్
-
Politics News
Andhra News: రూ.లక్షల కోట్ల ప్రజాధనం తీసుకొచ్చి అమరావతి గోతుల్లో పోయాలా?: మంత్రి బొత్స
-
Crime News
Crime: అసలే త్రిపుల్ రైడింగ్... ఒక్కరికి హెల్మెట్లు లేవు..పైగా వన్ వీల్‌తో విన్యాసాలు..
-
General News
Vande Bharat: సికింద్రాబాద్ - తిరుపతి ‘వందేభారత్’.. ప్రారంభోత్సవం రోజున ఆగే స్టేషన్లు ఇవే!
-
Movies News
Guna Sekhar: అప్పుడు మోహన్‌బాబు నా ఆఫర్ రిజెక్ట్ చేశారు: గుణశేఖర్