Nagababu: సీఎం జగన్‌ నటన ముందు మేం పనికిరాం: నాగబాబు

ముఖ్యమంత్రి నటన ముందు తామెవరం పనికిరామని.. ఆయన అంతలా నటిస్తారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు వ్యాఖ్యానించారు.

Updated : 22 Jan 2023 08:43 IST

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి నటన ముందు తామెవరం పనికిరామని.. ఆయన అంతలా నటిస్తారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు వ్యాఖ్యానించారు. కర్నూలులో శనివారం నిర్వహించిన జనసేన వీర మహిళలు, జన సైనికుల సభలో ఆయన మాట్లాడారు. వైకాపా ఎమ్మెల్యేలు జగనన్న కాలనీల్లో రూ.కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో వారే ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. వైకాపాకు లబ్ధి చేకూర్చేందుకు కొందరు వాలంటీర్లు సంక్షేమ పథకాలు ఇవ్వబోమని, పింఛను ఆపేస్తామని బెదిరిస్తున్నారని, అలాంటివారి మాటలను రికార్డు చేయాలని, లేకపోతే ముసుగేసి కొట్టాలని పిలుపునిచ్చారు. తాను వాలంటీర్లందరినీ అనట్లేదని, కొందరు అలా చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. జనసేన.. కుటుంబ పార్టీ కాదని నాగబాబు తెలిపారు. కార్యకర్తల నుంచే నాయకులు పుడతారని, రానున్న కాలంలో కార్యకర్తే సీఎం సీటులో కూర్చోవచ్చని అభిప్రాయపడ్డారు. తాను ఎన్నికల్లో పోటీ చేయట్లేదని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని