మెరుపు దాడులకు ఆధారాలేవీ?

మెరుపుదాడులు (సర్జికల్‌  స్ట్రైక్స్‌) చేసి చాలామంది ముష్కరుల్ని చంపినట్లు చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. దానికి తగ్గ రుజువుల్ని మాత్రం ఇప్పటివరకు ఎందుకు చూపించలేకపోతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ ప్రశ్నించారు.

Updated : 24 Jan 2023 08:57 IST

చాలామందిని చంపామంటూనే రుజువులివ్వరేం?: దిగ్విజయ్‌ సింగ్‌ 

జమ్మూ/ దిల్లీ: మెరుపుదాడులు (సర్జికల్‌  స్ట్రైక్స్‌) చేసి చాలామంది ముష్కరుల్ని చంపినట్లు చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. దానికి తగ్గ రుజువుల్ని మాత్రం ఇప్పటివరకు ఎందుకు చూపించలేకపోతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ ప్రశ్నించారు. ప్రభుత్వం అబద్ధాలపై ఆధారపడి పాలిస్తోందని విమర్శించారు. జమ్మూ-కశ్మీర్‌లో సోమవారం ‘భారత్‌ జోడో యాత్ర’ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 2019లో పుల్వామా ఉగ్రదాడి సమయంలో సైనికుల్ని శ్రీనగర్‌ నుంచి దిల్లీకి తరలించడానికి కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్పీఎఫ్‌) అభ్యర్థించినా ప్రభుత్వం దానికి అంగీకరించలేదనీ, దానివల్ల 40 ప్రాణాలు బలైపోయాయని దిగ్విజయ్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని