వివేకా హత్య కేసును నిష్పాక్షికంగా విచారించాలి

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిష్పాక్షిక విచారణ జరగాలని, దోషులను పట్టుకోవాలని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కోరారు.

Published : 25 Jan 2023 03:25 IST

దోషులను శిక్షించాలని రాజశేఖరరెడ్డి కుటుంబం కోరుకుంటోంది: వైఎస్‌ షర్మిల

ఈనాడు, హైదరాబాద్‌: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిష్పాక్షిక విచారణ జరగాలని, దోషులను పట్టుకోవాలని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘ఈ సంఘటన జరిగి సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇంత పేరున్న వ్యక్తి కేసుకే ఈ గతి పడితే  ప్రజలకు వ్యవస్థపై, సీబీఐపై నమ్మకం ఉంటుందా. ఇప్పటికైనా ఈ కేసులో నిజానిజాలు తేల్చండి. దోషులను శిక్షించాలని వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబం సీబీఐని కోరుతోంది. ఇలాంటి వాటిపై ప్రభుత్వ ఒత్తిడి ఉండకూడదని కోరుకుంటున్నాం.  

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావు

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు లేవు. భారాసను ప్రచారం చేసుకోవాలంటే కేసీఆర్‌కు సీఎం పదవి అవసరం. అందుకే ముందస్తు ఎన్నికలు రావనుకుంటున్నా. కొత్త అధ్యక్షుడిగా కాంగ్రెస్‌ ఎవర్నీ నియమించకుండా ఉండేందుకు, తన ప్రచారం కోసం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ముందస్తు అంటున్నారు.  పాలేరు నుంచి పోటీ చేస్తానని మాట ఇచ్చా. పాదయాత్ర ఫిబ్రవరిలో ముగించి ఆ నియోజకవర్గంపై దృష్టి పెడతా’ అని షర్మిల పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని