‘జీవో 317’ను రద్దు చేయాలనడం హాస్యాస్పదం: మంత్రి హరీశ్‌రావు

జీవో 317ను రద్దు చేయాలనడం హాస్యాస్పదమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆ జీవో గురించి తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.

Updated : 25 Jan 2023 06:28 IST

సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: జీవో 317ను రద్దు చేయాలనడం హాస్యాస్పదమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆ జీవో గురించి తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్నారు. నిరుద్యోగ యువతకు అన్యాయం చేసేవిధంగా కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయని విమర్శించారు. దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు సిద్దిపేటలో ఏర్పాటు చేసిన మెయిన్స్‌ ఉచిత శిక్షణ శిబిరాన్ని పోలీసు కన్వెన్షన్‌ హాలులో మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు ఉద్యోగాలకు సంబంధించి 3 నోటిఫికేషన్లు విడుదల చేశామన్నారు. అనంతరం అభ్యర్థులకు శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులను, పోలీసు అధికారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీ శ్వేత, అదనపు డీసీపీ (అడ్మిన్‌) మహేందర్‌, ఏసీపీలు ఫణిందర్‌, దేవారెడ్డి, చంద్రశేఖర్‌, క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ రాష్ట్ర నర్సింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు పాల సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని