ఉద్యోగిగా ఉన్న సమయంలో కులవివక్షకు గురయ్యా

పోలీసు శాఖలో ఉద్యోగం చేసే సమయంలో తానూ కుల వివక్షకు గురైనట్టు ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌ తెలిపారు.

Updated : 25 Jan 2023 06:22 IST

ఎమ్మెల్యే రాములునాయక్‌

వైరా, న్యూస్‌టుడే: పోలీసు శాఖలో ఉద్యోగం చేసే సమయంలో తానూ కుల వివక్షకు గురైనట్టు ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌ తెలిపారు. వైరా మండలంలోని గరికపాడులో మంగళవారం సీఎంఆర్‌ఎఫ్‌, కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లంబాడీ సామాజిక వర్గానికి చెందిన తనకు ఉద్యోగం చేసిన సమయంలో అద్దెకు ఇల్లు ఇవ్వలేదన్నారు. అద్దెకుండే ఇంటికి తన తల్లి సంప్రదాయ దుస్తులతో వస్తే ఖాళీ చేయించారని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్‌ పాలనలో కుల వివక్ష రూపుమాపడమే కాకుండా అన్నివర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. అనంతరం వేదికపై ఉన్న కొంతమంది నాయకులను (పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వర్గీయులు) ఉద్దేశించి మాట్లాడుతూ వేదికపై ఉన్న నాయకులందరూ ఎప్పుడూ తనతో ఉండాలని, కొత్త ఆలోచనలు చేస్తే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని