దేశమంతా కుప్పంవైపు చూస్తోంది
‘పండగ వాతావరణంలో యువగళం నిర్వహించాలి. తెదేపాకు కుప్పం నియోజకవర్గ పరిధిలో 66వేల మంది సభ్యత్వం ఉంది.
పండగ వాతావరణంలో యువగళం నిర్వహించాలి
తెదేపా అధినేత చంద్రబాబు
కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: ‘పండగ వాతావరణంలో యువగళం నిర్వహించాలి. తెదేపాకు కుప్పం నియోజకవర్గ పరిధిలో 66వేల మంది సభ్యత్వం ఉంది. అన్ని గ్రామాల నుంచి తరలివచ్చి యువగళంలో పాల్గొని విజయవంతం చేయండి. రాష్ట్రంతోపాటు దేశమంతా కుప్పంవైపు చూస్తోంది. తెదేపా కంచుకోట నుంచి ‘యువగళం’ విజయవంతంగా ముందుకు సాగేందుకు సమష్టి కృషి అవసరం. వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారు. జనం భయాన్ని పోగొట్టి స్వచ్ఛందంగా పాదయాత్రకు వచ్చేలా క్షేత్ర స్థాయిలో చైతన్యం తేవాలి’ అని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. కుప్పం నియోజకవర్గ పరిధిలోని 3,900 మంది నాయకులు, కార్యకర్తలతో మంగళవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. యువతరం గొంతును రాష్ట్రమంతా వినిపించేలా చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని చంద్రబాబు సూచించారు. తెదేపా ఆధ్వర్యంలో చేపట్టే ప్రతి కార్యక్రమాన్నీ కుప్పంలో ప్రారంభిస్తామని.. ఇదే తరహాలో లోకేశ్ యువగళం పాదయాత్ర ఇక్కడి నుంచే మొదలవుతోందని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Kadapa: కడప నడిబొడ్డున ఇద్దరు యువకుల దారుణహత్య
-
World News
Miss Universe : మిస్ యూనివర్స్ పోటీలు.. నన్ను చూసి వారంతా పారిపోయారు..!
-
Movies News
Samantha: ఎంతోకాలం తర్వాత గాయని చిన్మయి గురించి సమంత ట్వీట్
-
India News
Parliament: ‘అదానీ - హిండెన్‌బర్గ్’పై చర్చకు విపక్షాల పట్టు.. పార్లమెంట్లో గందరగోళం
-
Crime News
Hyderabad: సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇంట్లో భారీ చోరీ