సీఐడీ మాజీ చీఫ్‌ సునీల్‌ అక్రమ దందాలపై విచారణ చేపట్టాలి

సీఐడీ మాజీ చీఫ్‌ పి.వి.సునీల్‌ కుమార్‌, అధికారులు సునీల్‌ నాయక్‌, విజయ్‌ పాల్‌తో కలిసి చేసిన అక్రమ బలవంతపు వసూళ్ల దందాలపై విచారణ జరిపించాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు.

Published : 25 Jan 2023 05:42 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: సీఐడీ మాజీ చీఫ్‌ పి.వి.సునీల్‌ కుమార్‌, అధికారులు సునీల్‌ నాయక్‌, విజయ్‌ పాల్‌తో కలిసి చేసిన అక్రమ బలవంతపు వసూళ్ల దందాలపై విచారణ జరిపించాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు. ఈ విషయమై రాష్ట్రప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నానని  తెలిపారు. దిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ విభాగంలో రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించిన తులసి, డాక్టర్‌ ఆనంద్‌, నాగరాజు ఎవరని ఆయన ప్రశ్నించారు. అగ్రిగోల్డ్‌, అభయగోల్డ్‌, ఇతర ఆర్థికనేరాల కేసులతో ఆ ముగ్గురికి ఉన్న సంబంధమేంటో తేల్చాలని ఆయన డిమాండు చేశారు. ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న ఏదైనా మంచి నిర్ణయం ఉందంటే అది సీఐడీ చీఫ్‌గా సునీల్‌ను తప్పించడమేనన్నారు. వివేకానందరెడ్డి హత్యకేసును ఆంధ్రప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌కు బదిలీ చేశాకే కదలిక వచ్చిందన్నారు. అవినాష్‌ రెడ్డిని విచరణకు పిలిస్తే సమయం కావాలని కోరడం, ఆ వెంటనే పార్లమెంటు సమావేశాలు ఉండడం పరిశీలిస్తే విచారణ నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. అయినా విచారణకు సహకరిస్తానని అవినాష్‌ రెడ్డి పేర్కొనడం స్వాగతించాల్సిన విషయమేనన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు