జగన్‌ పర్యటనకు కంచెలతో భద్రత.. లోకేశ్‌ పాదయాత్రకు ఆంక్షలా?

ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పర్యటనలకు ముళ్లకంచెలు పెట్టి మరీ రక్షణ చర్యలు చేపడుతున్న పోలీసులు.. లోకేశ్‌ పాదయాత్రకు ఎక్కడలేని ఆంక్షలు విధించిడం దారుణమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

Published : 25 Jan 2023 05:42 IST

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పర్యటనలకు ముళ్లకంచెలు పెట్టి మరీ రక్షణ చర్యలు చేపడుతున్న పోలీసులు.. లోకేశ్‌ పాదయాత్రకు ఎక్కడలేని ఆంక్షలు విధించిడం దారుణమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బందోబస్తు కల్పించాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థకు లేదా అని మంగళవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ‘యువగళం పాదయాత్రపై ప్రభుత్వ ఆంక్షలు సీఎం జగన్‌రెడ్డి అభద్రతాభావానికి అద్దం పడుతున్నాయి. అందుకే పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. జగన్‌రెడ్డి పాదయాత్రకు తెదేపా ప్రభుత్వం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంది. కానీ ఇప్పుడు జగన్‌రెడ్డి ప్రభుత్వం లోకేశ్‌ పాదయాత్రను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రతిపక్ష నేతలకు పాదయాత్ర చేసే హక్కు లేదా? చంద్రబాబు గతంలో ఇలానే వ్యవహరిస్తే జగన్‌రెడ్డి పాదయాత్ర చేసేవారా? అధికారంలోకి వచ్చేవారా’ అని ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు