వైకాపా పాలనపై పది వేల ఛార్జిషీట్లు

వచ్చే మార్చిలో ప్రజాపోరు-2 కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల ఇళ్లను సందర్శించి రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతులను చేసి, పది వేల ఛార్జిషీట్లు రూపొందిస్తామని భాజపా రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డి వెల్లడించారు.

Published : 26 Jan 2023 05:03 IST

భాజపా రాష్ట్రశాఖ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డి

ఈనాడు, అమరావతి: వచ్చే మార్చిలో ప్రజాపోరు-2 కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల ఇళ్లను సందర్శించి రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతులను చేసి, పది వేల ఛార్జిషీట్లు రూపొందిస్తామని భాజపా రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డి వెల్లడించారు. పార్టీ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ 2024 ఎన్నికలే లక్ష్యంగా భాజపా 400 రోజుల ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. ఒకరిద్దరు భాజపా నేతలను చేర్చుకోవడానికి తెదేపా, వైకాపాలు అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ముందస్తు అనుమతులతోనే భీమవరంలో జరిగిన కార్యవర్గ సమావేశానికి పలువురు సీనియర్‌ నేతలు హాజరు కాలేదని తెలిపారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం జరుగుతోందని విష్ణువర్థన్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని