లోకేశ్‌ పాదయాత్రకు అన్ని ఆంక్షలా..?

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్రకు సవాలక్ష ఆంక్షలు పెట్టి అనుమతి ఇచ్చామని చెప్పడం విడ్డూరంగా ఉందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు.

Published : 26 Jan 2023 05:03 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్రకు సవాలక్ష ఆంక్షలు పెట్టి అనుమతి ఇచ్చామని చెప్పడం విడ్డూరంగా ఉందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి 29 ఆంక్షలను విధించి అనుమతి ఇస్తే, వాటిని వేర్వేరుగా చూడాలని చిత్తూరు ఎస్పీ వివరణ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దిల్లీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాదయాత్రలో పాటలు, ప్రసంగాలు, డీజేల వినియోగంపై ఆంక్షలు విధించడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. వైకాపాలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ఏకైక ప్రజాప్రతినిధిగా ఎవరు పాదయాత్ర నిర్వహించినా అది విజయవంతం కావాలని తాను కోరుకుంటానని ఆయన తెలిపారు. ఈ పాదయాత్రను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఏదో ఓ రకంగా అడ్డుకుంటారని రఘురామ ఆరోపించారు. కార్పొరేషన్ల పేరిట అప్పులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ మొత్తాన్ని దారి మళ్లిస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులు, నిర్మాణ రంగంపై దృష్టి సారిస్తుంటే... ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విధ్వంసాన్ని కోరుకుంటోందని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు