కాంగ్రెస్‌ పదవుల్ని వీడిన ఆంటోనీ తనయుడు

ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ మీద తాను చేసిన ట్వీట్‌ను దూషిస్తూ సందేశాలు, ఫోన్‌కాల్స్‌ వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలోని డిజిటల్‌ మీడియా, సోషల్‌ మీడియా పదవులకు రాజీనామా చేస్తున్నట్లు రక్షణశాఖ మాజీ మంత్రి ఎ.కె.ఆంటోనీ తనయుడు అనిల్‌ ప్రకటించారు.

Published : 26 Jan 2023 05:03 IST

తిరువనంతపురం: ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ మీద తాను చేసిన ట్వీట్‌ను దూషిస్తూ సందేశాలు, ఫోన్‌కాల్స్‌ వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలోని డిజిటల్‌ మీడియా, సోషల్‌ మీడియా పదవులకు రాజీనామా చేస్తున్నట్లు రక్షణశాఖ మాజీ మంత్రి ఎ.కె.ఆంటోనీ తనయుడు అనిల్‌ ప్రకటించారు. ఒక సాధారణ కార్యకర్తగా తాను కొనసాగుతానని చెప్పారు. ట్వీట్‌ను వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. భాజపాతో తమకు అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ.. రాజ్యాంగ సంస్థలపై బీబీసీ అభిప్రాయాలు వెల్లడించడం మన సార్వభౌమత్వాన్ని అణగదొక్కడం కిందికే వస్తుందంటూ అనిల్‌ తీవ్రంగా స్పందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు