కేంద్రంలో కాంగ్రెస్‌దే అధికారం

రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రకు ప్రజల్లో విశేషమైన ఆదరణ లభిస్తోందని, ఎన్నికల తరువాత కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాలీ శర్మ అభిప్రాయపడ్డారు.

Updated : 26 Jan 2023 05:49 IST

ఏఐసీసీ అధికార ప్రతినిధి డాలీ శర్మ

ఈనాడు, అమరావతి: రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రకు ప్రజల్లో విశేషమైన ఆదరణ లభిస్తోందని, ఎన్నికల తరువాత కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాలీ శర్మ అభిప్రాయపడ్డారు. విజయవాడలో బుధవారం ఆమె రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, నిత్యావసరాలు, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరిగాయి. వీటిని అదుపు చేయడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారు. రాహుల్‌ గాంధీ ప్రారంభించిన భారత్‌ జోడో యాత్రతో కాంగ్రెస్‌కి పూర్వ వైభవం రాబోతుంది’ అని డాలీ శర్మ పేర్కొన్నారు.

అలాగైతే జగన్‌ యాత్ర చేసేవారా?

అప్పటి ప్రభుత్వం అనుమతించకపోతే ప్రతిపక్ష నేతగా జగన్‌ పాదయాత్రకు ముందుకెళ్లేవారా? అని గిడుగు రుద్రరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జీవో 1కి వ్యతిరేకంగా అందరికీ ఆమోదయోగ్యమైన తీర్పు వస్తుందని ఆశిస్తున్నామని అభిప్రాయపడ్డారు. ‘చేయి చేయి కలుపుదాం’ పేరుతో రాష్ట్రంలో నిర్వహించే పాదయాత్ర విశాఖలో గురువారం ప్రారంభమవుతుందని తెలిపారు. మార్చి 26 వరకు అన్ని జిల్లాల్లోనూ యాత్ర నిర్వహించేలా కార్యచరణ రూపొందించామని ఆయన వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు