మేఘాలయ శాసనసభ ఎన్నికలు.. కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం దిల్లీలో భేటీ అయ్యింది. మేఘాలయ శాసనసభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే 55 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది.

Updated : 26 Jan 2023 07:04 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం దిల్లీలో భేటీ అయ్యింది. మేఘాలయ శాసనసభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే 55 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. లోక్‌సభ ఎంపీ, మేఘాలయ పీసీసీ అధ్యక్షుడు విన్సెంట్‌ హెచ్‌.పాలా, ఎన్సీపీకి రాజీనామా చేసి రెండు రోజుల క్రితం కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే సలెంగ్‌ ఎ.సంగ్మా తొలి జాబితాలో టికెట్‌ ఖరారైన వారిలో ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు