కాకాణి తప్పించుకోలేరు

కోర్టులో దొంగతనం, ఇతర కేసుల్లోనూ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తప్పించుకోలేరని, న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠకు సంబంధించిన ఈ కేసులో ఆయనకు శిక్ష తప్పదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated : 26 Jan 2023 05:45 IST

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే: కోర్టులో దొంగతనం, ఇతర కేసుల్లోనూ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తప్పించుకోలేరని, న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠకు సంబంధించిన ఈ కేసులో ఆయనకు శిక్ష తప్పదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన దొంగతనం కేసులో సీబీఐ అధికారులు అనంతకృష్ణన్‌, రాజశేఖర్‌ బుధవారం ఆయనను మూడోసారి విచారించారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో 2 గంటలపాటు ఈ విచారణ సాగింది. కాకాణికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లతో కూడిన పూర్తి వివరాలను అధికారులకు సోమిరెడ్డి అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తనవద్ద 161 స్టేట్‌మెంట్‌ అధికారికంగా తీసుకున్నారని తెలిపారు. ‘నేను పెట్టిన నకిలీ డాక్యుమెంట్ల కేసుతోపాటు సివిల్‌, క్రిమినల్‌ డిఫమేషన్‌ కేసుల్లోనూ కాకాణి తప్పించుకోలేరు. నేను చెప్పేది జ్యోతిష్యం కాదు. జరగబోయే వాస్తవం. ఆయనకు శిక్ష పడటం ఖాయం. గతంలోనూ విషపూరిత నకిలీ మద్యానికి సంబంధించి నాలుగు కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. నకిలీ కేసు ఒకటి.. పుదుచ్చేరిలో అల్లుడు పెట్టిన కేసు కూడా మరొకటి ఉంది. విశ్రాంత ఉద్యోగుల ఇళ్ల ప్లాట్ల కబ్జాల్లోనూ నిందితుడిగా ఉన్నారు’ అని సోమిరెడ్డి వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు