ఉద్యోగాలివ్వడం చేతగాని జగన్‌ దిగిపోవాలి

యువతకు ఉద్యోగాలివ్వడం చేతగాని అసమర్థ సీఎం జగన్‌ వెంటనే దిగిపోవాలని తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ డిమాండు చేశారు.

Updated : 26 Jan 2023 05:47 IST

గేదెలు కాస్తూ తెలుగు యువత నాయకుల నిరసన

యువతకు ఉద్యోగాలివ్వడం చేతగాని అసమర్థ సీఎం జగన్‌ వెంటనే దిగిపోవాలని తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ డిమాండు చేశారు. నిరుద్యోగ భృతి పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండు చేస్తూ గుంటూరు గుజ్జనగుండ్లలోని విద్యుత్తుశాఖ కార్యాలయం నుంచి జిల్లా ఉపాధి కార్యాలయం వరకు పట్టభద్రుల కోటు ధరించి గేదెలు కాస్తూ బుధవారం నిరసన తెలియజేశారు. ఉపాధి కార్యాలయం వద్ద గేదెలకు కుడితి పెట్టి గడ్డి వేసి దున్నపోతు ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలని నినాదాలు చేశారు.

న్యూస్‌టుడే, గుంటూరు (పట్టాభిపురం)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు