తాడిపత్రిలో జరిగే ఘోరాల్లో డీఎస్పీయే తొలి ముద్దాయి

అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగే అన్ని ఘోరాలు, భూ దందాల్లో మొదటి ముద్దాయి డీఎస్పీ చైతన్య అని తెదేపా మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు.

Published : 26 Jan 2023 05:33 IST

జేసీ ప్రభాకర్‌రెడ్డి

అనంతపురం (రాణినగర్‌), న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగే అన్ని ఘోరాలు, భూ దందాల్లో మొదటి ముద్దాయి డీఎస్పీ చైతన్య అని తెదేపా మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. బుధవారం అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. డీఎస్పీతోపాటు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారుడు స్థలాలను ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. రూ.కోట్ల విలువైన తమ స్థలాన్ని కొట్టేయాలనే ఉద్దేశంతో కలెక్టరుకు రెండు ఫిర్యాదులు ఇచ్చారని తెలిపారు. అధికారులు విచారణ జరిపి ఆ స్థలం 1907 నుంచి ఎవరి పేరుతో ఉందో చెబుతూ చివరకు తమ కోడలి పేరుతో ఒకటి, కొడుకు అస్మిత్‌రెడ్డి పేరుతో మరొకటి ఉందని నివేదించారని వెల్లడించారు. డీఎస్పీ పెట్టుకున్న బ్యాచ్‌ను ఉసిగొల్పి తక్కువ రేటుకు ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కుమారుడి పేరుతో భూములు కొంటున్నారని ధ్వజమెత్తారు. అనంతపురం డీఐజీ, ఎస్పీలు వెంటనే డీఎస్పీ విషయంలో జోక్యం చేసుకోవాలని డిమాండు చేశారు. తనపై ఇప్పటికే 68 కేసులు పెట్టారని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు