యువగళం పాటల ఆవిష్కరణ

తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పాదయాత్రకు రెండు పాటలను ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్‌ విడుదల చేశారు.

Published : 26 Jan 2023 05:33 IST

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పాదయాత్రకు రెండు పాటలను ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్‌ విడుదల చేశారు. స్థానిక కమతమూరు రోడ్డులోని బహిరంగ సభా వేదికను వారు బుధవారం పరిశీలించారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం ఆధ్వర్యంలో యువగళం పాటను సిద్ధం చేశారు. ఈ ఆడియోను సభా వేదికపై ప్రారంభించారు. ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు, తెదేపా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు, పలువురు నాయకులు ఉన్నారు.

పాట సాగిందిలా..: ‘అదిగో చూడు వస్తున్నాడు.. రామన్న దమ్ముతోటి.. చంద్రన్న దన్నుతోటి వస్తున్నాడు.. వస్తున్నాడు.. యువనేత వస్తున్నాడూ.. రా.. రా.. తమ్ముడా.. రారా మండే సూర్యుడా.. రారా తమ్ముడా.. రారా మండే సూర్యుడా.. రారా తమ్ముడా.. రారా నిండు చంద్రుడా.. తెలుగుజాతి తెగువ నువ్వై.. పసుపు జెండా పొగరు నువ్వై.. యువగళాన గొంతువయ్యి.. యువనేతకు అండవయ్యి.. నువ్వడుగు పెడితే.. నువ్వడుగు పెడితే.. నువ్వడుగు పెడితే.. రత్నగర్భ రక్షకట్టదా.. రాయలసీమ సై అంటూ వెంట నడవదా.. నువ్వడుగు పెడితే సింహపురి శివాలెత్తదా.. మన ఒంగోలె దండుకట్టి నీతో నడవదా.. రారా తమ్ముడా.. రారా మండేసూర్యుడా.. రారా తమ్ముడా రారా నిండు చంద్రుడా..’ అంటూ సాగిన పాట యువతగళాన్ని విప్పింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు