ఫిబ్రవరి 5న నాందేడ్‌కు కేసీఆర్‌... అదే రోజు చేరికల సభ

భారాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫిబ్రవరి 5న మహారాష్ట్రలోని నాందేడ్‌లో పర్యటించనున్నారు. అదేరోజు అక్కడ చేరికల సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 27 Jan 2023 04:23 IST

ఈనాడు, నిజామాబాద్‌: భారాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫిబ్రవరి 5న మహారాష్ట్రలోని నాందేడ్‌లో పర్యటించనున్నారు. అదేరోజు అక్కడ చేరికల సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం నాందేడ్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో హింగోలి బ్రిడ్జి పక్కన మైదానాన్ని ఎంపిక చేశారు. వివిధ పార్టీల మాజీ ప్రజాప్రతినిధులు చేరనున్నట్లు చెబుతున్నారు. ఏర్పాట్లపై ఆ పార్టీ ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టింది. సభకు అనుమతులు ఇవ్వాలంటూ ఎస్పీ కృష్ణ కొకాటేను భారాస ప్రజాప్రతినిధులు గురువారం కలిశారు. ఎస్పీని కలిసిన వారిలో జహీరాబాద్‌ ఎంపీ బీబీపాటిల్‌, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, హన్మంత్‌షిండే, షకీల్‌, బాల్క సుమన్‌, పౌరసరఫరాల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ రవీందర్‌ సింగ్‌ ఉన్నారు. అయిదు రోజులుగా అక్కడే మకాం వేసిన వీరు స్థానికంగా స్థిరపడిన తెలంగాణ వాసులతో సమావేశమవుతున్నారు. 5వ తేదీ కార్యక్రమాలపై ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ‘ఈనాడు’తో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ నాందేడ్‌లో గురుద్వారాను దర్శించుకొని మొక్కులు చెల్లిస్తారని చెప్పారు. భద్రతా అంశాల్లో భాగంగా ఎస్పీని కలిసినట్లు వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని